అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు హక్కులు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆయన '96' రీమేకును సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో వున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష నటించిన ఈ సినిమా, వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాను శర్వానంద్ .. సమంతలతో నిర్మించడానికి దిల్ రాజు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తమిళంలో ఈ సినిమా నడిచిన కథాకాలం .. పాత్రలను మలిచిన తీరు చాలా సహజంగా అనిపిస్తాయి. అయితే ఎక్కడా కూడా కథలోని 'ఆత్మ' దెబ్బతినకుండా, తెలుగు నేటివిటీకి తగినట్టుగా కొన్ని మార్పులు చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడట. కథలోని ఫీల్ ను దృష్టిలో పెట్టుకునే కొత్త టైటిల్ ను పెట్టాలనే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాకి టైటిల్ ను సెట్ చేసుకుని, ఉగాది నుంచి ఈ సినిమా షూటింగును మొదలుపెట్టేలా సన్నాహాలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.